రాశి ఖన్నా గౌను పై అలీ బూతు మాటలు !

Seetha Sailaja


కమెడియన్ అలీ ఏదైనా ఫిలిం ఫంక్షన్ కు వ్యాఖ్యాతగా వచ్చాడంటే చాలు ఎవరో ఒక సెలెబ్రెటీని తన డబల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇబ్బంది పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. యాంకర్ సుమ, శ్యామల, క్యూట్ హీరోయిన్ సమంత ఇలా చాలామంది అలీ బాదితులుగా మారిపోతున్నారు. ఇప్పుడు లిస్టులోకి లేటెస్ట్ గా రాశి ఖన్నా వచ్చి చేరడం హాట్ న్యూస్ గా మారింది. 

ఈమధ్య జరిగిన మాటివి సినిమా అవార్డ్స్ ఫంక్షన్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా అలీ వ్యవహరించాడు. సినిమా రంగానికి చెందిన అనేక మంది సెలెబ్రెటీలు పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది హీరోయిన్స్ చాల గ్లామరస్ ముస్తాబు అయి వచ్చారు. అయితే వీరందిరిలోకి రాశి ఖన్నా వేసుకున్న గౌన్ టాక్ ఆఫ్ ది ఈవెంట్ గా మారింది.

అందమైన లాంగ్ గ్రీన్ గౌన్ తో రాశి ఖన్నా ఈ అవార్డుల ఫంక్షన్ లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ హడావిడి అలీ దృష్టిలో పడటంతో వెంటనే రాశి ఖన్నా పై సెటైర్లు వేయడం మొదలు పెట్టాడు. ఆ సెటైర్లలో డబల్ మీనింగ్ వచ్చేట్లు ఉండటంతో ఆ అవార్డు ఫంక్షన్ కు వచ్చిన వారంతా అలీ మాటలను తెగ ఎంజాయ్ చేసారు.

రాశి ఖన్నా వేసుకున్న పొడువైన గౌన్ పై కామెంట్ చేస్తూ అలీ ‘ఈసారి ఇటువంటి పెద్ద ఫంక్షన్స్ కు ఇలాంటి గౌనులు వేసుకుని వస్తున్నప్పుడు నా సేవలు ఉపయోగించుకో నీ గౌను ఎత్తిపట్టుకుని నీ కూడ నడిచి వస్తూ నీకు సహాయం చేస్తాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అలీ. అంతేకాదు రాశి ఖన్నా డ్రస్ ను చూస్తూ ఉంటే స్వచ్ భారత్ కార్యక్రమానికి రాశి బ్రాండ్ అంబాసిడర్ గా మారిందా అన్న అనుమానం వస్తోందని అంటూ రాశి వేసుకున్న పొడవాటి గౌన్ తో నడుస్తూ ఉండటం వల్ల మాటివి అవార్డ్స్ ఫంక్షన్  జరుగుతున్న  ప్రాంగణం అంతా క్లీన్ అయిపోతోంది అంటూ సెటైర్లు వేసాడు అలీ. అయితే రాశికి మాత్రం అలీ వేసిన డైలాగ్స్ లోని డబల్ మీనింగ్ పూర్తిగా అత్ధం కాకపోవడంతో అలీ మాటలకు తెగ మురిసి పోయిందట..
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: