ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్టేటస్ కు అతి సమీపంలో ఉన్న రకుల్ ప్రీత్ నేటి తరం టాప్ యంగ్ హీరోల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అందువల్లనే ఆమె ఇంటి ముందు ప్రస్తుతం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు రకుల్ తాను నటించిన యంగ్ హీరోల పై ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ శక్తికర కామెంట్స్ చేసింది.
తాను ఎంట్రీ ఇచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ హీరో సందీప్ కిషన్ గురించి మాట్లాడుతూ సందీప్ పని రాక్షసుడు అని చెపుతూ ఎప్పుడూ తాము నటించే సినిమాలోని సీన్స్ గురించే మాట్లాడుతూ ఆ సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అంటూ తెగ బుర్ర తింటాడని సెటైర్లు వేసింది రకుల్. అయితే హీరో ఆది మాత్రం చాల కూ ల్ గా ఉంటాడని సినిమా షూటింగ్ సమయంలో ఏమైనా సమస్యలు వచ్చినా పట్టించుకుని టెన్షన్ పడడని ఆ సమస్య దానంతట అదే తీరిపోతుంది అంటూ కామెంట్ చేస్తాడని ఆది పై అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఇక తనకు స్టార్ స్టేటస్ క్రియేట్ చేసిన ‘లౌక్యం’ సినిమా హీరో గోపీచంద్ గురించి మాట్లాడుతూ ఏ విషయాన్ని అయినా సరే చాల బ్యాలెన్స్డ్ గా తీసుకుంటు బాధను ఆనందాన్ని ఒకేవిధంగా చూసే గోపీచంద్ తో నటించిన తరువాత తాను జీవితం గురించి చాల తెలుసుకున్నాను అంటూ తన మనసులోని భావనను వ్యక్త పరిచింది రకుల్ ప్రీత్. లేటెస్ట్ గా రకుల్ నటించిన ‘పండుగ చేస్కో’ హీరో రామ్ గురించి మాట్లాడుతూ నటిస్తున్నప్పుడు ఒక పూనకం వచ్చినట్లు నటించే ఎనర్జీ ఉన్న రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరోను తాను ఇప్పటి వరకు చూడలేదు అంటూ రామ్ పై ప్రశంసలు కురిపించింది.
మాస్ మహారాజా రవితేజ గురించి మాట్లాడుతూ తమ ఇద్దరి అభిరుచులు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అంతేకాదు తమ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒకటే అని చెపుతూ లొకేషన్ లో రవితేజా ఉంటే అక్కడి వాతావరణం అంతా ఎనర్జిటిక్ గా మారిపోతుందని అంటూ అంత అల్లరి చేసే రవితేజా కెమెరా ముందుకు వచ్చి ఎటువంటి సీన్ అయినా అతిసునాయాసంగా నటించే అతడి ప్రతిభను చూస్తే తనకు ఆశ్చర్యo కలుగుతుందని రవితేజాను తెగ పొగిడింది రకుల్. ఇక మంచువారి అబ్బాయి మంచు మనోజ్ గురించి మాట్లాడుతూ లొకేషన్ లో జోక్స్ వేయాలి అంటే మంచు మనోజ్ కు మించిన సామర్ధ్యం మరెవ్వరికీ లేదని అతడి కామెడీకి ఎవరైనా సరే నవ్వి తీరవలసిందే అంటూ ఆ ఆరుగు హీరోల పై మరెన్నో కామెంట్స్ చేసింది రకుల్ ప్రీత్..