చిరంజీవి 150వ సినిమా పై బన్నీ షాకింగ్ కామెంట్స్ !

Seetha Sailaja


చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ బాలీవుడ్ లలో కూడ హాట్ న్యూస్ గా హడావిడి చేసింది. చిరంజీవి 8 సంవత్సరాల తరువాత తిరిగి నటిస్తూ ఉండటంతో టాలీవుడ్ సెలెబ్రెటీలు అంతా చిరంజీవిని అభినందిస్తూ తమ ట్విటర్లలో ట్విట్స్ చేసి హడావిడి చేసారు. అయితే ఈ విషయంలో కొద్దిగా ఆలస్యంగా స్పందించిన అల్లుఅర్జున్ ట్విట్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. 

‘ఎప్పటి నుండో చిరంజీవిగారి 150వ సినిమా గురించి నేను కూడ ఎదురు చూస్తున్నాను. ది కింగ్ ఈజ్ బ్యాక్. ఈ సినిమాకు మంచి పేరు సూచిస్తారా’ అంటూ బన్నీ ట్విట్ చేసి తన అభిమానులను గందరగోళంలో పడేసాడు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘ఆటో జానీ’ అన్న టైటిల్ నిశ్చయమైంది అని వార్తలు వస్తున్న నేపద్యంలో బన్నీ ఈ ట్విస్ట్ ఇచ్చాడు ఏమిటి అంటూ బన్నీ అభిమానులే కాకుండా సినిమా రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు అల్లుఅర్జున్ ట్విట్ వెనుక అర్దాల పై చర్చలు చేస్తున్నారు.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం అల్లుఅర్జున్ కు చిరంజీవి 150 వ సినిమా టైటిల్ నచ్చక ఇలా కామెంట్ చేసాడా లేదంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి టైటిల్ అనుకోలేదని తన అభిమానులకు సంకేతాలు ఇస్తూ ఈ ట్విట్ చేసాడా ? అనే విషయం పై రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా కథకు సంబంధించి వివాదాలు మొదలైన నేపధ్యంలో ఈసినిమా టైటిల్ విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు అనే అర్ధాలు అల్లుఅర్జున్ ట్విట్ ద్వారా తెలుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి బన్నీ అభిమానులు చిరంజీవి సినిమాకు ఎటువంటి టైటిల్ సుచిస్తారో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: