సెమీ షకీలా తెలుగు సినిమా

దర్శకుడు మారుతికి షకీలా బూతు సినిమాలు చూసిన అనుభవం చాలా ఉన్నట్టుంది. అందుకే, అటు పూర్తి నీలిచిత్రంగానూ కాకుండా ఇటు తెలుగు సినిమాలానూ కాకుండా సెమీ షకీలా తెలుగు సినిమా తీశాడు. అతగాడు తీసిన బస్టాప్ సినిమాను చూసి జనాలంతా ఇలాగే అనుకుంటున్నారట. అందుకు ఉదాహరణగా సినిమాలోని సన్నివేశాలనే చెబుతున్నారు. ఒకమ్మాయి ఒక యువకుడితో... ‘జాబ్ ఇప్పిస్తారా’ అని అడుగుతుంది. అప్పుడతడు ‘రా... ఇప్పి ఇస్తా’ అంటాడు. ఒక యువకుడు బాత్ రూమ్ లో ఫోన్ లో సెక్స్ చేసి వస్తాడు. బాత్ రూమ్ లో అతడు హస్తప్రయోగం చేసుకోవడం కూడా చూపిస్తారు. ఒకబ్బాయి ఒకమ్మాయికి ఫోన్ చేసి ‘నేను ఫోన్ చేసినప్పుడు కాల్ ఎత్తు. ఒక్కసారి కాల్ (కాళ్లు అని అర్థం వచ్చేలా అంటాడు) ఎత్తితే వారం వరకూ ఏమీ అడగను’ అంటాడు. ఇలాంటి బూతుబాగోతాలు బోలెడున్నాయి ఈ సినిమాలో. ఈ సీన్లనూ డైలాగులనూ యువతను దృష్టిలో పెట్టుకుని రాశాడట మారుతి. తల్లిదండ్రులు కూడా ఈ సినిమాను తప్పకుండా చూడాలట. తల్లిదండ్రులకూ యువతకూ సందేశమిచ్చేందుకు ఈ సినిమా తీశాడట. ఏం సందేశమో... ‘నేను ‘ఈరోజుల్లో’ నుంచీ బూతు సినిమాలనే తీస్తున్నాను’ అన్న సందేశమేనేమో. ఇన్ని బూతు డైలాగులూ దృశ్యాలున్నా ఇవేవీ సెన్సార్ వాళ్లకు కనిపించలేదు. వాళ్లు ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్ ఇచ్చేసి చేతులు కడిగేసుకున్నారు... కాదు కాదు, ఎవరు వాళ్ల చేతులను తడిపారో. ఈ సినిమా డైలాగుల్లోలానే... మారుతి పేరును కూడా ద్వంద్వార్థంలో కోతి అని సరిపెట్టుకుంటే ఈ సినిమాను వదిలేయొచ్చు. కానీ, ఇలాంటి సినిమాలను సమాజం మీదకు వదిలేయడం ఎంత వరకూ న్యాయమో ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: