బుల్లి తెర పై ప్రభాస్ టాక్ షో !
నిన్న మొన్నటి వరకు బుల్లితెర పై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో హడావిడి చేసిన నాగార్జున ఆ కార్య క్రమానికి విరామం ప్రకటించి మళ్ళీ తన సినిమాల పై దృష్టి పెట్టాడు. అయితే ప్రభాస్ గత రెండు సంవత్సరాలుగా ‘బాహుబలి’ కోసం అన్ని వదులుకుని కష్టపడిన తరువాత ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో బుల్లితెరవైపు దృష్టి పెడుతున్నాడు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘సౌందర్య లహరి' పేరుతో ఓ సెలబ్రిటీ టీవీ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు ఈ కార్యక్రమoలో పాల్గొనడం ద్వారా ఈ షో రేటింగ్స్ పెంచుతున్నారు. ఈ షో రేటింగ్స్ మరింత పెంచడానికి అతి త్వరలో రాజమౌళి, ప్రభాస్ కూడా ఈ షోలో కనిపించబోతున్నారు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన టీవీ సీరియల్ ‘శాంతి నివాసం' ద్వారా రాజమౌళి తన కెరియర్ ప్రారంభించి ‘స్టూడెంట్ నెం.1' ద్వారా దర్శకుడిగా మారిన రాజమౌళి నేటి టాలీవుడ్ దర్శకులలిస్టు లో మొదటి స్థానం లో ఉన్నాడు . రాజమౌళి సినీ కెరియర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు అలాగే బాహుబలి సినిమాకు సంభందించిన అనేక విషయాలు ప్రభాస్ రాజమౌళి లు ఈ షోలో షేర్ చేసుకుంటారని టాక్ .
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ పూర్తయిన నేపధ్యంలో ఈ వారం కానీ, వచ్చే వారం కానీ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుందిఅని టాక్. మే 15న బాహుబలి విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈ సినిమాకు సంభందించి మొట్టమొదటి పబ్లిసిటీ షోగా సౌందర్య లహరి టాక్ షో మారనుంది అని అనుకోవాలి .