షాకింగ్ గా మారిన నాగ సౌర్యసాహసం !
టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ హీరోలలో నాగ సౌర్యకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఏర్పడింది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే సన్నగా రొమాంటిక్ హీరోలా ఉండే ఈ హీరో పక్కా మాస్ మసాల హీరోగా మారిపోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.
ప్రస్తుతం ఇతడు ‘జాదూగాడు’ గా ఒక మాస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ పోస్టర్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అంతేకాదు అందరి దృష్టిని ఈ టీజర్ పోస్టర్ ఆకర్షిస్తోంది. రొటీన్ మసాల సినిమాలకు భిన్నంగా విడుదలైన ఈ టీజర్ పోస్టర్ ను చూస్తూ ఉంటే ఈవిధంగా కూడా పబ్లిసిటీ చేస్తారా అనిపించడం సహజం.
గతంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘చింతకాయల రవి’ సినిమాకు దర్శకత్వం వహించిన యోగేష్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఆ సినిమా అప్పట్లో విజయవంతం కాకపోవడంతో ఈ దర్శకుడు తెరమరుగు అయ్యాడు. ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన బాలీవుడ్ మూవీ ‘జంజీర్’ తెలుగు వర్షన్ ‘తుఫాన్’ దర్శకత్వ భాద్యతలను ఈ దర్శకుడు నిర్వహించాడు.
అదికూడ కలిసి రాకపోవడంతో ఈ దర్శకుడి పేరు అందరూ మర్చిపోయారు. అయితే అందరు మర్చి పోయిన ఆ దర్శకుడికి అవకాశం ఇచ్చి ఇలా ‘జాదూగాడు’ లా నాగ సౌర్య చేస్తున్న ప్రయోగం చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పుడిప్పుడే నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న ఈ యువ హీరోకు ఇటువంటి ప్రయోగాలు అవసరమా అనే మాటలు కూడా వినపడుతున్నాయి..