పెళ్లికాకుండానే విడిపోతున్నాడా అని అపార్థం చేసుకోకండి. నాగచైతన్య... నాగార్జున మొదటి భార్య, రామానాయుడి కుమార్తెకు కొడుకు. చిన్నప్పట్నుంచీ రామానాయుడిగారి ఇంట్లోనే రానా, రానా తమ్ముడు, చెల్లి, వెంకటేష్ పిల్లలతోనే కలిసి పెరిగాడు.
తెరంగేట్రం చేశాక నాగార్జున ఇంట్లోకి వచ్చాడు. ఇప్పుడు వరుస షూటింగులతో బిజీగా ఉన్నాడు. అయితే, నాగార్జున ఇంట్లో ఉంటే... అమ్మతో ఉండటం కుదరదు. అందుకే, అమ్మతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుని కొండాపూర్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. కేవలం తన సంపాదనతోనే ఈ ఫ్లాట్ ను కొన్నాడట నాగచైతన్య. అయితే, అందులో కొంత పని బాకీ ఉండటంతో ఇన్నాళ్లూ వేచి ఉన్నాడు. ఇప్పుడు ఆ పని అయిపోవడంతో అమ్మతో కలిసి అక్కడకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడట.
ఇంతకీ... ఈ ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేసిందెవరో తెలుసా... నాగచైతన్య తల్లి లక్ష్మి. ఆమె... పర్సనల్ ఇంటీరియర్ డిజైనర్. ఆమె చేతులతో ఇంటీరియర్ పనిచేసిన ఇంట్లో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందంటున్నాడు చైతన్య. వచ్చే నెలలో కొత్తింటికి మారబోతున్నాడట చైతన్య.
సో, ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట.
మరింత సమాచారం తెలుసుకోండి: