శ్రీకారం చుట్టుకున్న 'పెళ్లిపుస్తకం'

"అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో.. తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో.. ' అంటూ అప్పట్లో వచ్చిన 'పెళ్లిపుస్తకం' సినిమా ప్రేక్షకులను ఎంత అలరించిందో అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి అదే టైటిల్ తో మరో సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేమ్‌ రాహుల్‌, నీతిటేలర్‌ హీరోహీరోయిను్లగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ తాను గతంలో డైరీ పేరిట ఓ థ్రిల్లర్‌ చిత్రం చేశానని, ఇపrడు రెండో ప్రయత్నంగా పెళ్లిపుస్తకం చిత్రం చేస్తున్నానని చెప్పారు. టైటిల్‌ గురించి బాపుగారి అనుమతి తీసుకున్నామని, అయితే ఆయన చిత్రానికి ఈ కథకి ఎంతో తేడా ఉంటుందని, బాపుగారి పేరునిలబడేలా ఈ సినిమా నూటికినూరుపాళ్లు బాగా వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. శ్రీరస్తు, శుభమస్తు అనే పాటను కూడా ఈ చిత్రంలో వాడుతున్నామని, పెళ్లయిన జంట జీవితంలో ఎలాంటి కష్టనష్టాలను ఎదుర్కొన్నారో అనే అంశం ఆధారంగా చిత్రం సాగుతుందని వివరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: