7 కోట్ల కారుని బహుమతిగా అందుకుంటున్న త్రిష !

Seetha Sailaja
సినిమా తారలు తమ పారితోషికాల విషయంలోనే కాదు తాము చేసుకుంటున్న పెళ్ళిళ్ళలో కూడా అత్యంత విలాసవంతంగా ఖర్చుపెడుతూ తమ రేంజ్ ని అందరికి తెలిసివచ్చేలా చేస్తున్నారు. రెండురోజుల క్రితం తన పెళ్ళి విషయాన్ని అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన త్రిష మరోసారి వార్తలలోకి ఎక్కింది. త్రిష ప్రేమించి పెళ్ళాడుతున్న తమిళ నిర్మాత వరుణ్ కేవలం సినిమానిర్మాత మాత్రమే కాదు చెన్నైలో పేరుమోసిన డైమండ్ ఎక్స్ పోర్టర్. ఈనెలలో జరగాబోతున్న వారి నిశ్చతార్దానికి త్రిష ప్రేమికుడు వరుణ్ తన రేంజ్ ని తెలిపే విధంగా 7 కోట్ల విలువ చేసే బ్లాక్ కలర్‌ ‘రోల్స్‌ రాయిస్’ కారుని త్రిషకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన ప్రేయసి త్రిషను తాజ్మహల్ ను చూపెట్టడానికి ప్రత్యేక విమానంలో తీసుకు వెళ్ళి సంచలనం చేసిన వరుణ్ కు ఈ రేంజ్ గిఫ్ట్ త్రిషకు ఇవ్వడం పెద్ద స్థాయికి మించిన పనికాదు. ఈవార్తలు ఇలా ఉండగా ఈనెలలో జరగబోతున్న త్రిష యంగేజ్ మెంట్ కు సినిమావారిని ఎవ్వరినీ పిలవకుండా కేవలం తన బందువుల మధ్య మాత్రమే ఈ సంబరాలను చేసుకుంటుందట త్రిష.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: