విజయ దేవరకొండ బాక్సింగ్ కోసం ప్రత్యేక శిక్షణ...!

VAMSI
ఒకప్పుడు అగ్ర దర్శకుడుగా మాస్ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. అయితే తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో గొప్ప విజయాలు అందించిన ఈ డైరెక్టర్ కి  ఈ మధ్య  కాలంలో వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తూనే వచ్చాడు. అయితే ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఘన విజయాన్ని సాధించి మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈ చిత్రం అందించిన  జోష్ తో ఉన్న ఈ దర్శకుడు ఫుల్ స్పీడ్ తో ఉన్నాడు.  ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేస్తున్నాడు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లైగర్ అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం అందరికీ విదితమే.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అటు విజయ్ దేవరకొండ ఇటు పూరి భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కాంబినేషన్ పై ప్రేక్షకులు కూడా భారీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో బాలీవుడ్ దర్శకుడు కమ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా పాలు పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో బాక్సర్ గా కనిపించనున్న హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కోచింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఈ చిత్ర షూటింగ్ వారం రోజులు నిర్విరామంగా కొనసాగించేందుకు ప్లాన్ చేశారట. అందుకోసం సెట్ కూడా సిద్దం చేశారట. ఈ సెట్ లో ఓ వారం రోజులు షూటింగ్ జరగనుంది. అర్జున్ రెడ్డి సినిమాతో  స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ...ఇప్పుడు ఈ సినిమా కూడా అంతకు మించిన విజయాన్ని అందిస్తుందని ఆకాంక్షిస్తున్నాడు. మరి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రావాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: