బిటౌన్ ని బయపెడుతున్న జాహ్నవి సినిమా... మహా దారుణం..!!!

Purushottham Vinay
మన టాలీవుడ్ ప్రేక్షకులు ఎంత సినిమా పిచ్చోళ్ళో చెప్పలేం.అన్ని ఇండస్ట్రీల కంటే కూడా మన టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలని చాలా అందరిస్తారు. ఇక మన టాలీవుడ్ లో కరోనా లాక్ డౌన్ తరువాత సినిమాల పరిస్థితి కాస్త మెరుగుపడిందనే చెప్పాలి. లాక్ డౌన్ అనంతరం జనాలు సినిమాలు చూడడానికి థియేటర్లకు వస్తున్నారు. దీంతో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన 'జాతిరత్నాలు' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళని రాబడుతూ ఒక రేంజిలో దూసుకుపోతుంది.మంచి ప్రేక్షకాధరణ పొంది మంచి హిట్ అయ్యింది. ఇక టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉందనే చెప్పాలి.ఇక టాలీవుడ్ కంటే ముందుగానే బాలీవుడ్ లో థియేటర్లు తెరిచారు. కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు రావడం లేదు. ఏ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావట్లేదు.కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన 'ఇందూ కీ జవానీ', 'మేడం చీఫ్ మినిష్టర్' లాంటి సినిమాలకు అసలు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. రీసెంట్ గా జాన్వీ కపూర్ నటించిన హారర్ కామెడీ సినిమా 'రూహి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


ఈ సినిమాతో బాక్సాఫీస్ పరిస్థితి మారుతుందనుకుంటే అది కూడా జరగడం లేదు. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. మొదటిరోజే సినిమాకి దారుణమైన టాక్ వస్తుంది. సినిమా చాలా వరస్ట్ గా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా ఎంత దారుణంగా ఉందంటే కనీసం సినిమా ఎలా ఉందో చూడడానికి థియేటర్లకు  వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా చాలా తక్కువ. దేశవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ.3 కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది. షేర్ చూసుకుంటే కోటిన్నర కంటే తక్కువ. డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాతో ఘోరాతి ఘోరమైన నష్టాలు తప్పేలా లేవు.


 సినిమాకి దారుణమైన టాక్ రావడంతో వీకెండ్ లో కూడా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. 'రూహి' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోని వర్కవుట్ అయితే.. సినిమాలు రిలీజ్ చేద్దామనుకున్న నిర్మాతలు ఇప్పుడు తమ సినిమాను విడుదల చేయడానికి వణికి పోతున్నారు. ఇక సినిమా ఎలా వున్న కాని తన అందం అభినయంతో సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లే హీరోయిన్ మన అతిలోక సుందరి శ్రీదేవి. అలాంటిది ఆమె కూతురు జాహ్నవి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎదుర్కోవడం ఏంటని బాలీవుడ్ లో విమర్శలు వినిపిస్తున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: