బంపర్ ఆఫర్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ.. ఏకంగా మహేష్ సినిమాలో..?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు  సంపాదించుకుంటారు. ఇక అంతే కాదు మొదటి సినిమాతోనే దర్శక నిర్మాతలను ఆకర్షించి  వరుస అవకాశాలు అందుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.ఇలాంటి హీరోయిన్ల కోవలోకే వస్తుంది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.  ఈ అమ్మడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.



 అయితే ఉప్పెన సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించింది కృతి  శెట్టి ..  ఇక బేబమ్మ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.  సాధారణంగా సినిమా అవకాశాలు రావాలి అంటే అందరూ అందాల ఆరబోత చేయాలి అని చెబుతూ ఉంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం  అలాంటివేవీ చేయలేదు తన చిరునవ్వుతోనే వరుసగా ఆఫర్లు అందుకుని  తన నటనతో అందరినీ మెప్పించి అవకాశాలను రాబట్టుకుంది.  ఉప్పెన  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.



 అయితే ఇక మొదటి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం వరుస ఆఫర్లు ఈ ముద్దుగుమ్మ చెంత  వచ్చి వాలి పోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని..  ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాలలో  కృతి శెట్టి అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం కృతి శెట్టి కి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్ లో ఒక ప్రచారం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కృతి శెట్టికి  హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది అనేది ఒక టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందట. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది అనే ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: