వకీల్ సాబ్ ను కలవర పెడుతున్న వీరమల్లు !
అయితే ఇప్పుడు ఈ ఆనందం ‘వకీల్ సాబ్’ మూవీకి శాపంగా మారుతుందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి పవన్ రీ ఎంట్రీ మూవీగా ‘పింక్’ రీమేక్ న్ ఎంచుకోవడం పవన్ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు అన్న మాటలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ‘పింక్’ మూవీని అందరు ఇప్పటికే చూసేసిన పరిస్థితులలో ఈమూవీ రీమేక్ లో కొత్తగా చూపెట్టే విషయం ఏముంటుంది అన్న అభిప్రాయం పవన్ అభిమానులలో ఉంది.
దీనికితోడు అనుభవంలేని దర్శకుడు వేణు శ్రీరామ్ చేతిలో పవన్ రీ బ్యాక్ మూవీ పడటం పవన్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. వాస్తవానికి ‘వకీల్ సాబ్’ గత ఏడాది సమ్మర్ లో విడుదల కావలసి ఉంది. కరోనా పరిస్థితులు వల్ల వాయిదా పడ్డ ఈమూవీ ఇప్పుడు ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ కి ఇంకా నెల రోజులు టైమ్ లెలేకపోయినప్పటికీ 'వకీల్ సాబ్' పై బజ్ క్రియేట్ కాకపోవడం పవర్ స్టార్ అభిమానులను భయపెడుతోంది.
మ్యూజికల్ మార్చ్ అంటూ ఈమూవీకి సంబంధించిన పాటల రిలీజ్ లో భాగంగా ఈమధ్యనే రిలీజ్ అయిన ‘సత్యమేవ జయతే’ పాటకు ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. దీనికి తోడు ఇప్పుడు 'వీరమల్లు' లుక్ రాకతో అభిమానులు 'వకీల్ సాబ్' గురించి ఎక్కువగా మాట్లాడుకోకుండా ఎక్కువగా వీరమల్లు గురించి మాట్లాడుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలు మటుకు ఇప్పటికే ‘వకీల్ సాబ్’ భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లను కలవర పెడుతున్నట్లు టాక్. దీనితో ఈ మూవీ ప్రమోషన్ విషయంలో దిల్ రాజ్ స్పీడ్ పెంచితే బాగుంటుందని పవన్ అభిమానుల అభిప్రాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి..