ప్రభాస్ సెల్ తో మాట్లాడే అలవాట్ల పై నాగ్ అశ్విన్ కామెంట్స్ !

Seetha Sailaja
ప్రస్తుతం భారత దేశంలో సెల్ ఫోన్ వాడకం తార స్థాయికి చేరుకోవడంతో మనదేశంలో ప్రజలు ఉపయోగిస్తున్న సెల్స్ సంఖ్య 60 కోట్లకు దాటి ఉందని ఒక అంచనా. భారత్ లో ఒక పూట తిని కాలం గడుపుకునే వ్యక్తి కూడ తన పక్కన సెల్ లేకుండా రోజు గడపడంలేదు. ఇక సెలెబ్రెటీల విషయానికి వస్తే వారు ఉపయోగించే అత్యంత విలాసవంతమైన సెల్స్ ధరలు లక్షలలో ఉంటాయి.

ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ సెల్ వాడకం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రభాస్ ను తాను అనేకసార్లు కలిసానని అయితే ఎప్పుడు అతడి పక్కన సెల్ చూడలేదు అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు ప్రభాస్ ఎప్పుడు ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నట్లు మెసేజ్ లు చూస్తున్నట్లు తనకు కనిపించలేదని చెపుతూ తన దగ్గరకు వచ్చిన వ్యక్తితో ప్రభాస్ మధ్యమధ్య ఫోన్స్ మాట్లాడుతూ కాలం గడపకుండా చాల మనస్పూర్తిగా ఎలాంటి గర్వం లేకుండా మాట్లాడతాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.

ఇదే సందర్భంలో ప్రభాస్ అతిధి మర్యాదలు గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఎవరైనా అతిధులు తన ఇంటికి వచ్చినప్పుడు ప్రభాస్ చేసే అతిధి మర్యాదలు తట్టుకోవడం కష్టం అని చెపుతూ భోజనం చేసి వచ్చాము అని చెప్పినా వినకుండా రకరకాల స్వీట్స్ వచ్చిన వ్యక్తుల ముందు పెట్టి వారిని తినమని పదేపదే బలవంత పెట్టడం ప్రభాస్ అలవాటు అంటూ కామెంట్స్ చేసాడు.

ఇక తాను ప్రభాస్ తో తీయబోతున్న మూవీ గురించి మాట్లాడుతూ ఈమూవీ సబ్జెక్ట్ ఇంతవరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కానీ అదేవిధంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కానీ రాలేదని అందువల్లనే ఈమూవీ స్క్రిప్ట్ విషయంలో ఆలస్యం జరుగుతోంది అంటూ ఈమూవీ ఆలస్యం వెనుక అనేక కారణాలను వివరించాడు. నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి నిర్మించిన ‘జాతి రత్నాలు’ మూవీ సక్సస్ అయితే ఇంకా ఇలాంటి చిన్న సినిమాలు తన వద్ద నుండి చాల వచ్చే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: