మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన మహేష్ బాబు...?

VAMSI
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోలు అనిపించుకుంటున్నారు కొంత మంది హీరోలు. అలాంటి వారిలో మహేష్ బాబు పేరు ముందు ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సమాజసేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కాకపోతే ఈయన అందించే సహాయాలను గుట్టు చప్పుడు కాకుండా చేస్తుంటాడు ఈ రియల్ హీరో. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులు ప్రాణాలు నిలబడడానికి దేవుడిగా మారారు మహేష్. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులకు సహాయం అందించగా ఇటీవలే..గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతున్న ఓ చిన్నారి అంకిత్‌ భార్గవ్‌కు మహేష్‌ ఆపరేషన్‌ చేయించి కొత్త జీవితాన్ని అందించిన విషయం తెలిసిందే.

ఒక బిడ్డకి  గుండె ఆపరేషన్ చేయించడం అంటే చిన్న విషయమేమీ కాదు... డబ్బు సహాయాన్ని అందించడంతో పాటు మంచి మనసును కూడా కలిగి ఉండాలి. ఈ చిట్టి బాబు ఆపరేషన్ కోసం మహేష్ బాబు మరియు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఆర్థిక సహాయాన్ని అందించి మరోసారి వారి దయా గుణాన్ని చాటుకున్నారు.  వీఎస్‌డీ, పీడీఏతో బాధపడుతున్న చిన్నారి అంకిత్‌ భార్గవ్‌ కి ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన మహేష్ బాబుకు మరియు నమ్రతకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఆరోగ్యంగా ఉన్న తమ బిడ్డను చేతిలో పెట్టుకుని ఎంతో ఆనందంగా ఉన్న ఆ తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేసుకున్నారు నమ్రతా శిరోద్కర్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రిన్స్  పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ వార్త విన్న వారు. ఇలాంటి వాటిని స్పూర్తిలా తీసుకుని మరింత మందికి సహాయపడాలని మహేష్ బాబు అభిమానాలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: