మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ డ్రామా మూవీ మహర్షి. రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. మొదటి నుంచి కూడా తనదైన స్టైల్లో ఎమోషన్ తో కూడిన కమర్షియల్ సినిమాల స్పెషలిస్టు అయిన వంశీపైడిపల్లి అదే పంథాలో మహేష్ బాబు తో తెరకెక్కించిన మహర్షి మూవీ ద్వారా మరింత మంచి పేరు దక్కించుకున్నారు.
ఈ మూవీలో మహేష్ బాబు రిషి అనే మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తనదైన ఆకట్టుకునే నటనతో ఆడియన్స్ నుంచి మరింత క్రేజ్ సంపాదించారు. మహేష్ బాబు కెరీర్ 25 సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కేయూ మోహనన్ ఫోటోగ్రఫీ అందించిన ఈ సినిమాలో రైతులు పడుతున్న సమస్యలు ఆవేదన గురించి ఒక మంచి పాయింట్ ని చూపించిన వంశీ పైడిపల్లి తద్వారా అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే లేటెస్ట్ గా శర్వానంద్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా శ్రీకారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అయితే ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన అనంతరం ఇది మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కి పార్ట్ 2 మాదిరిగా ఉందని కొందరు కామెంట్ చేయడం జరిగింది. అయితే మహర్షి కి, శ్రీకారానికి ఏమాత్రం సంబంధం లేదని కాకపోతే రెండు సినిమాల్లోనూ రైతుల గురించి ప్రస్తావించిన అంశం మాత్రం ఒక్కటేనని, రేపు మూవీ రిలీజ్ తర్వాత రెండు వేర్వేరు అని మీకే అర్థం అవుతుందని యూనిట్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విచ్చేయడం ఈ సినిమా యొక్క సక్సెస్ కి మంచి హెల్ప్ అవుతుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.....!!