పవన్ రీమేక్ కోసం చాలా కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్....
ఫలితంగా తీవ్ర నష్టాలు మిగిల్చింది.కథ, కథనంలోని లోపాలు అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ కు కారణమయ్యాయి. అజ్ఞాతవాసి ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీరరాఘవ, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాలు తెరకెక్కించగా ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి . త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నా అజ్ఞాతవాసి ఫ్లాప్ భయం మాత్రం త్రివిక్రమ్ ను వెంటాడుతోందని ఆ కారణం వల్లే పవన్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉన్నా త్రివిక్రమ్ పవన్ సినిమాకు డైరెక్షన్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.అయితే పవన్ సినిమాకు డైరెక్షన్ చేయకపోయినా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాకు మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాకి ఎంతో పవర్ ఫుల్ మాటలను అందించాబోతున్నాడట త్రివిక్రమ్. ఎంతో కసిగా ఈ సారి తన వంతు ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ కి ఏదో విధంగా సాయపడాలని త్రివిక్రమ్ చాలా కసిగా పని చేస్తున్నాడట...మరి చూడాలి ఈ సినిమా ఎంతమాత్రం పవన్ కి హిట్ ఇస్తుందో... త్రివిక్రమ్ కృషి ఫలిస్తుందో లేదో....!!