పవన్, మహేష్ లకు పోటీగా బరిలోకి దిగుతున్న నాగార్జున..

Suma Kallamadi
అక్కినేని నాగార్జున మన్మధుడు 2 సినిమా తో భారీ డిజాస్టర్ ను చవిచూశారు. ఆ తర్వాత మళ్ళీ రొమాంటిక్ సినిమాల జోలికి వెళ్లకుండా వైల్డ్ డాగ్ అనే ఒక యాక్షన్ మూవీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. అయితే ఈ సినిమా ఏప్రిల్ 2, 2021 న విడుదల కానున్నది. ఆశిషోర్ సోలమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున విజయ్ వర్మ అనే ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దియా మీర్జా, సైయామి ఖేర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ లో నాగార్జున కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అదేంటంటే సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. స్క్రిప్టు రెడీ అయిందని.. జూన్ లేదా జులై నెలల్లో సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. అయితే ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా 2022 వ సంవత్సరంలో విడుదల చేయనున్నారు. కాగా అదే పండుగ సందర్భంగా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట.. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో లో వస్తున్న విరూపాక్ష సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా హై బడ్జెట్ తో భారీ తారాగణంతో ప్రముఖ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నాయి.

అయితే ఈ రెండు సినిమాలు విడుదల అవుతున్న సమయంలోనే బంగార్రాజు వంటి ఫ్యామిలీ డ్రామా చిత్రం రిలీజ్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. మరి నాగార్జున తన సినిమా రిలీజ్ డేట్ చేంజ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నాగచైతన్య ప్లేస్ లో మరొక హీరో ని ఎంపిక చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఆ హీరో ఎవరో ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: