విరామం లేకుండా తెగ తిరిగేస్తున్న ఉప్పెన జంట...!!!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సాధారణంగా ఏదైనా ఒక సినిమాకు మాములు సాధారణ హిట్ అయితేనే ప్రెస్ మీట్ లు పెట్టి పబ్లిసిటీ చేస్తారు.గ్రాండ్ గా సక్సెస్ ఈవెంట్ తో ఎండ్ చేయడం ఈ రోజుల్లో చాలా  సర్వ సాధారణం అయిపోయింది. అయితే ఉప్పెన సినిమా పెద్ద విజయం సాధించడంతో ఆ సినిమాకు వచ్చిన విజయంతో సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో ఏ మాత్రం ఆగకుండా చేసేస్తున్నారు. ఉప్పెన సినిమా మొదలైనప్పటి నుంచి విజయయాత్ర కొనసాగుతూనే ఉంది. హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్ కృతి శెట్టిలు ఇద్దరు కూడా నాన్ స్టాప్ గా ప్రమోషన్ల కోసం తెగ తిరిగేస్తున్నారు. వారితో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖమైన థియేటర్స్ ను సందర్శిస్తూ అభిమానులను కలవడం జరుగుతుంది...


ఇక రాజమండ్రిలో మొదలైన విజయోత్సవాలు రెండు వారాలైనా ఇంకా తగ్గడం లేదు. అన్నవరం - కాకినాడ వంటి ప్రాంతాల్లో కూడా బాగానే తిరిగారు. కేవలం థియేటర్స్ అనే కాకుండా అక్కడ ఉండే పుణ్య క్షేత్రాలను కూడా సందర్శిస్తున్నారు.ఇక వైజాగ్ లో సందర్శించిన తరువాత తెలంగాణ బయలుదేరిన చిత్ర యూనిట్ మొదట కరీంనగర్ లోని మమతా థియేటర్ కు వెళ్లింది. అలాగే వరంగల్ రాధిక థియేటర్ ను కూడా సందర్శించి అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.అలాగే వరంగల్ లోని భద్రకాళి టెంపుల్ కు కూడా వెళ్లింది.


ఇక ఈ రోజు తిరుపతికి కూడా వెళ్లారు. గత రెండు వారాలుగా విరామం లేకుండా ఇలా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఇక ఉప్పెన కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఉప్పెన 70కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: