అఖిల్ కోసం సైకిల్ పై వచ్చిన వీరాభిమాని..ఎక్కడి నుండో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

MADDIBOINA AJAY KUMAR
హీరోల కోసం అభిమానులు ఎంత సాహసమైనా చేస్తారు. ఇతివల ఓ అభిమాని అల్లు అర్జున్ ను కలిసేందుకు మెదక్ నుండి కాలినడకన హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి అనుభవమే ఇప్పుడు అక్కినేని హీరో అఖిల్ కూడా ఎదురైంది. నెల్లూరుకు చెందిన శివ శెంకర్ అనే అభిమాని అఖిల్ ను కలవదానికి నెల్లూరు నుండి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేసాడు. మొత్తానికి సైకిల్ పై హైదరాబాద్ చేరుకుని అఖిల్ ను కలిసాడు. తన సైకిల్ కు శివ శంకర్ ఒక ప్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాడు. ప్లెక్సీ లో నాగార్జున , అఖిల్ ఫోటోలను వేయించుకున్నాడు. నాగార్జున ఫొటోకు మన్మథుడు అని ...అఖిల్ ఫొటోకు నవమన్మథుడు అని వేయించుకున్నాడు. ఇక అఖిల్ ఆ అభిమానిని చూసి ముచ్చట పడ్డాడు. ఇదిలా ఉండగా అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇండస్ట్రీ లో సరైన హిట్ కోసం సతమతవుతూనే ఉన్నాడు. టాలీవుడ్ లోకి అఖిల్ బడా డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఆ ఆ తరవత హెలో, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించగా ఆ సినిమాలు కూడా నిరాశపరిచాయి. దాంతో అఖిల్ హిట్ కోసం అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెడ్గే అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ సినిన్ఆ విడుదల తేదీని కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 19న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇక ఈ సినిమా హిట్ అవ్వడం అనేది అఖిల్ కు ఎంతో కీలకంగా మారింది. అంతే కాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న నాగార్జున కు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో ముఖ్యం. మరోవైపు దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: