మొదటి సినిమాతో రికార్డు ఓపెనింగ్స్ సాధించిన మన తెలుగు హీరోలు వీళ్ళే....
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ప్రస్తుతం ఈ రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు.ఉప్పెన చిత్రం మొదటి రోజు 9.3 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక రెండవ స్థానంలో టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ వున్నాడు.వి వి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన అఖిల్ చిత్రంతో ఇతను మొదటి రోజు 7.6 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక మూడవ స్థానంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వున్నాడు.చిరుత చిత్రంతో ఇతని మొదటి రోజు 3.75 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక మరో మెగా తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నాలుగవ స్థానంలో వున్నాడు.ముకుంద చిత్రంతో ఇతను మొదటిరోజు 3.36 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక ఐదవ స్థానంలో ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లం కొండ శ్రీనివాస్ వున్నాడు.అల్లుడు శీను చిత్రంతో ఇతను మొదటి రోజు 2.86 కోట్ల షేర్ ను రాబట్టాడు..
ఇక ఆరవ స్థానంలో కింగ్ నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య వున్నాడు.జోష్ చిత్రంతో ఇతను మొదటి రోజు 2.60 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక ఏడవ స్థానంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వున్నాడు.పిల్ల నువ్వులేని జీవితం .. చిత్రంతో మొదటి రోజు ఇతను 2.30 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఇక ఎనిమిదవ స్థానంలో దగ్గుబాటి వారసుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు రానా వున్నాడు.లీడర్ చిత్రంతో ఇతను మొదటి రోజు 1.7 కోట్ల షేర్ ను రాబట్టాడు.జయం చిత్రంతో నితిన్ మొదటి రోజు 1.2 కోట్ల షేర్ ను రాబట్టి తొమ్మిదవ స్థానంలో వున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు చిత్రంతో మొదటి రోజు 1కోటి పైనే షేర్ ను రాబట్టి పదవ స్థానంలో వున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...