బేబమ్మ వెంట పడుతున్న దర్శక నిర్మాతలు.. రెండు కన్ఫర్మ్.. మూడు సినిమాలకు అడ్వాన్సులు..!
ఇక ఉప్పెన రిలీజ్ తర్వాత ఆమెకు దర్శక నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చేందుకు వెంట పడుతున్నారట. ఇప్పటికే ముగ్గురు నిర్మాతలు ఆమెకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కృతి శెట్టి చేసిన బేబమ్మ రోల్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను గిల్లేసింది అమ్మడు. అందుకే సినిమాకు ఆమె కోసం రిపీటెడ్ ఆడియెన్స్ వెళ్తున్నారని అంటున్నారు. బేబమ్మ పాత్రలో కృతి శెట్టి అదరగొట్టేసింది అన్నది అందరు అనుకుంటున్న మాట.
నాని సినిమాలో సాయి పల్లవితో పొటీ పడుతుంది ఈ చిన్నది. అంతేకాదు సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది. ఈ సినిమాల్లో ఒక్కటి సూపర్ హిట్టైనా సరే కృతి శెట్టి టాలీవుడ్ ను ఏలేస్తుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ మనసు గెలిచిన భామల్లో కృతి శెట్టి ఒకరు. తప్పకుండా అమ్మడికి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచు. కృతి శెట్టి పర్ఫార్మెన్స్ గురించి కేవలం ఆడియెన్స్ మాత్రమే కాదు సూపర్ స్టార్స్ కూడా ప్రశంసిస్తున్నారు. తప్పకుండా ఆమెకు తెలుగులో మంచి అవకాశాలే వస్తాయని ఫిక్స్ అవ్వొచ్చు.