
జబర్దస్త్ మహేష్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
అప్పట్లో రేలంగి, అల్లు రామలింగయ్య, రాజబాబు ల జనరేషన్ ముగిశాక ఆ తర్వాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ సత్యనారాయణ, వేణుమాధవ్ ఇలా ఎందరో కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక వీరి జనరేషన్ ముగిసిన తర్వాత సప్తగిరి, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర లాంటి ఎంతో మంది కమెడియన్లు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరందరి ట్రెండ్ కొనసాగుతూనే మరో కొంత మంది కమెడియన్లు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపుతున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ నుంచి వచ్చిన మహేష్ కూడా ఒకడు.
బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ కామెడీ షో ఎంట్రీ ఇచ్చాక, చాలామంది కమెడియన్ కి చాన్స్ దొరికింది. అంతేకాకుండా వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం తో పాటు సినిమాల్లో కూడా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. అంతే కాకుండా ఎక్కడో కొన్ని ప్రాంతాల నుండి వచ్చి తమ కంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్నారు కమెడియన్లు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్స్ లో సుధీర్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వడమే కాక, తన టీం కూడా ఒక సినిమా చేస్తోంది.
ఇక ఒకప్పుడు సైడ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన జబర్దస్త్ మహేష్, ఆ తర్వాత టీం లీడర్ గా తన సత్తా చాటుకున్నాడు. ఇక బుల్లి తెర మీదే కాదు వెండితెరపై కూడా దూసుకెళ్తున్నాడు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా మహానటి సినిమాలో కొంచెం విలనిజం చూపించి,తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. రంగస్థలం సినిమా ద్వారా మహేష్ కు అందిన అభినందనలను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ లో చిన్న చిన్న పాత్రలు వేసిన టీం తోనే ఇటీవల స్పెషల్ ఎంట్రీ ఇచ్చి,తాజాగా సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ లో హీరోగా మహేష్ ఎంట్రీ ఇచ్చి, అందరిని అలరించాడు. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా కమెడియన్, విలన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర దొరికినా సరే నటించడానికి సై అంటున్నాడు.