నాంది బిజినెస్.. అంత తక్కువకు ఎందుకు అమ్మారంటే..!

shami
తనకు బాగా కలిసి వచ్చిన కామెడీ సినిమాలను పక్కన పెట్టి ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ లో అల్లరి నరేష్ చేసిన ప్రయత్నమే నాంది. విజయ్ కనకమేడల డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో న్యాయం కోసం పోరాడే ఓ వ్యక్తి పాత్రలో నరేష్ నటిస్తున్నాడు. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువగా జరిగింది.

సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కేవలం కోటిన్నర మాత్రమే బిజినెస్ చేసింది. నైజాం 1 కోటి.. ఆంధ్రా, సీడెడ్ కలిసి 50 లక్షలు బిజినెస్ చేసిందని తెలుస్తుంది. మొత్తంగా 1.50 కోట్లతో నాంది రిలీజ్ అవుతుంది. సినిమా మీద నరేష్ పూర్తి నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఈమధ్యనే రిలీజైన బంగారు బుల్లోడు కూడా ఫ్లాప్ అవడంతో నరేష్ ఈ సినిమాను తక్కువ బిజినెస్ కే వదిలేసినట్టు తెలుస్తుంది.

అంటే నరేష్ నాంది హిట్ అనిపించుకోవాలి అంటే 2 కోట్లు వసూలు చేస్తే సరిపోతుంది. మరి నాంది ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉన్నా అనుకున్న ఈ టార్గెట్ అయినా రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తిగా ఉన్నాయి. తప్పకుండా నాంది నరేష్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా మిగిలిపోతుందని అంటున్నారు. నాంది మంచి ఫలితాన్ని అందుకుంటే అల్లరి నరేష్ ఇక మీదట కామెడీ సినిమాలు వదిలేసి ఇలానే సీరియస్ కథలను చేయాలని అనుకుంటున్నాడట. అయితే నాంది రిజల్ట్ ను బట్టి తన తదుపరి సినిమాలు ఆధారపడి ఉన్నాయని నరేష్ బలంగా నమ్ముతున్నాడు.                               

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: