'పుష్ప' సినిమా కోసం సుకుమార్ సంచలన నిర్ణయం.. షాక్ లో నిర్మాతలు..??

Anilkumar
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి కూడా అలాగే ఉంది. ఇప్పటికే పుష్ప షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది.ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నామని ప్రకటించారు దర్శక నిర్మాతలు.ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో సుకుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ చిత్ర కథ ప్రకారం ఎక్కువ భాగం అడవుల్లోనే సాగుతుంది.
 
అందుకే అప్పట్లో థాయ్ లాండ్ అడవులకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు కానీ కుదర్లేదు. కరోనాతో ఏ అడవులు సేఫ్ కాదనుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో ఉన్న అడవుల్లోనే షూటింగ్ కొంతవరకు చేసారు మేకర్స్. కానీ అప్పుడు కరోనా వచ్చి యూనిట్ లో ఒకరు చనిపోవడంతో మళ్లీ వెనక్కి తగ్గాడు సుకుమార్. ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు లెక్కల మాస్టారు. ఇప్పటి పరిస్థితుల్లో లేనిపోని రిస్కులు తీసుకోవడం మంచిది కాదని ఆయన నిర్ణయించుకున్నాడు.అందుకే ఇకపై ఔట్ డోర్ వద్దని యూనిట్ కు చెప్పినట్లు తెలుస్తుంది.
 
ఈ అడవుల సెట్ ఏదో హైదరాబాద్ లోనే వేద్దామని నిర్మాతలకు కూడా సుకుమార్ నచ్చజెప్పినట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా దీనికి ఓకే చెప్పడంతో హైదరాబాద్ లోనే పుష్ప కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతీసారి అడవుల్లో షూటింగ్ అంటే అనుకున్న దానికంటే షూట్ ఆలస్యం అవుతున్నందుకే సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మీక హీరోయిన్ గా నటిస్తోంది..ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు బన్నీ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: