ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..?
ఇంతకుముందెప్పుడూ సోషల్ మీడియాలో అనుపమ యాక్టివ్ గా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ పుణ్యమా అని ఈ అమ్మడు ట్రెండ్ మార్చేసింది. ఈ టైం లో పూర్తిగా స్లిమ్ లుక్లో కి మారిపోయింది. ఈ మలయాళ ముద్దుగుమ్మ వరుస ఫోటో షూట్ లతో ఇన్స్టా లో హల్ చల్ చేస్తోంది . ఫిబ్రవరి 18 అనుపమ పుట్టిన రోజు కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె సోషల్ మీడియాలో తన చిన్నప్పటి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఇరింజలకుడ లో 1996 ఫిబ్రవరి 18న పరమేశ్వరన్,సునీత దంపతులకు జన్మించింది. ఆమె తన పై చదువులను కొట్టాయం సీఎంఎస్ కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రధాన విషయంగా ఉన్నత విద్యను అభ్యసించింది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తి కారణంగా చదువులకు పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టింది. ఈ అమ్మడు మలయాళం సినిమా ప్రేమమ్ సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించి పెట్టింది. ఇక ఆ తర్వాత మలయాళం చిత్రమైన జేమ్స్ అండ్ అలైస్ లో కూడా అవకాశం చిక్కింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది ఈ అమ్మడు.
ఆ తర్వాత నితిన్,సమంత నటించిన" అ ఆ "సినిమాలో కూడా ఈమె మలయాళం అయినప్పటికీ, తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇక ఆ తర్వాత తెలుగులో శతమానం భవతి సినిమా లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి పెట్టింది అని చెప్పవచ్చు. మరో రెండు రోజుల్లో అనుపమ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ ఫోటో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.