రాధే శ్యామ్ లో ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..?

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సిహ్నిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నారు. ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే అలరించనుంది.
వాలెంటైన్స్ డే రోజు కానుకగా సినిమా నుండి ఓ ఫస్ట్ గ్లింప్స్ వదిలారు. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అంటే ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను అలా కాదని అంటాడు. అయితే ఈ టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసమే భారీగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం దాదాపు 6 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు టాక్.
సినిమాలో వీటి కోసం స్పెషల్ బడ్జెట్ కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ప్రభాస్ లుక్, స్టైల్, క్యారక్టరైజేషన్ ఇవన్ని ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాయని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఆడియెన్స్ కు షాక్ ఇస్తుందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. సినిమాలో కొన్ని సర్ ప్రైజ్ ఎలిమినెట్స్ అందరిని అలరిస్తాయని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ సలార్, ఆదిపురుష్ రెండు సినిమాలను చేస్తున్నాడు. రానున్న సినిమాలతో ప్రభాస్ తన సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నాడు. వరుస సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దుమ్ముదులిపేయాలని చూస్తున్నాడు.                                        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: