నా స్కిట్ లో కామెడీ కాదు.. అదే ఎక్కువ ఉంటుంది.. నిజం ఒప్పుకున్న అదిరే అభి..?

praveen
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్  కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఇక ప్రతి వారం కూడా సరికొత్త కామెడీని పంచుతూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది జబర్దస్త్ కార్యక్రమం. ఈ క్రమంలోనే ఇక నవ్వుల రారాజు గా కొనసాగుతున్న ఈ జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే.  ఇకపోతే జబర్దస్త్ లో ఎన్నో ఏళ్ల నుంచి టీమ్ లీడర్ గా  కొనసాగుతున్నాడు అదిరే అభి.



 యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత డాన్సర్ గా కూడా తన సత్తా చాటి ఇక చివరికి జబర్దస్త్ టీం లీడర్ గా సెటిల్ అయ్యాడు. ఇక ప్రతీ వారం కూడా అదిరే అభి తనదైనశైలిలో సరికొత్త గెటప్ తో తెర మీదికి వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇక అదిరే అభి స్కిట్ లో కామెడీ తక్కువగా ఉంటుంది అని అప్పుడప్పుడు జడ్జీలు కూడా పంచులు వేస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఏకంగా అదిరే అభి కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇటీవలే ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చాడు అదిరే అభి.



 అదిరే అభి తో పాటు మాధవిలత, చలాకి చంటి, హిమజ లు  కూడా క్యాష్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చారు అయితే అదిరే అభి ఎంట్రీ ఇస్తూనే ఇక ఒక పాట మీద అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ వేసాడు. ఇక పాట ముగిసిన తర్వాత అక్కడికి వచ్చిన యాంకర్ సుమ.. మీరు రోజు డాన్స్ ప్రాక్టీస్ చేస్తారా అంటూ అడిగుతుంది.. అయితే జబర్దస్త్ లో నా స్కిట్ లో కామెడీ కంటే ఎక్కువ డాన్స్  ఉంటుందని.. చెబుతాడు అదిరే అభి. దీంతో అందరు నవ్వుకుంటారు. కాగా ఇటీవల విడుదలైన క్యాష్ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: