లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

shami
విజయ్ దేవరకొండ, పూరీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న పూరీ ఈ సినిమాతో నేషనల్ లెవల్ లో తన సత్తా చాటాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో సినిమా తీయకుండానే అక్కడ హాట్ ఫేవరేట్ అయ్యాడు విజయ్ దేవరకొండ.

అర్జున్ రెడ్డి సినిమా తెలుగు వర్షన్ సూపర్ హిట్ కాగా ఆ సినిమాతో బాలీవుడ్ లో విజయ్ గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక ఇప్పుడు లైగర్ తో డైరెక్ట్ గా రంగంలోకి దిగుతున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్రేజ్ తెచ్చుకోగా ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ వచ్చిన పోస్టర్ తో మరింత అంచనాలు పెంచారు. సెప్టెంబర్ 9న లైగర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో అనన్యా పాండే తెలుగు తెరకు పరిచయం అవుతుంది.

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్ లో విజయ్ డ్యాషింగ్ లుక్ అదిరిపోయింది. చూస్తుంటే ఈసారి పాన్ ఇండియా లెవల్ లో విజయ్ తన స్టామినా ప్రూవ్ చేసుకుంటాడని ఫిక్స్ అవ్వొచ్చు. పూరీ టేకింగ్, విజయ్ యాక్టింగ్ కలిసి సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయని తెలుస్తుంది. సెప్టెంబర్ 9న రిలీజ్ అని ఎనౌన్స్ చేయగానే విజయ్ ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. పూరీ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నాయట. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ కోరుకునే సీన్స్ కూడా పూరీ ఈ సినిమాలో ఉంచారని తెలుస్తుంది. విజయ్ ఈసారి నేషనల్ వైడ్ గా తన మేనియా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. మరి లైగర్ తో విజయ్ దేవరకొండ ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: