రాధేశ్యామ్ టీజర్ హైలైట్స్ తెలిస్తే.....మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం ...??
ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ అతి త్వరలో జరుగనుంది. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జయరాం, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ గా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఈ నెల 14 న లవర్స్ డే సందర్భంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ ప్రీ టీజర్ ని యూనిట్ విడుదల చేసింది.
ప్రభాస్ లవర్ బాయ్ గా కనపించనున్న ఈ మూవీ టీజర్ యొక్క హైలైట్స్ ఇవే అంటూ ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో ఎంతో వైరల్ అవుతోంది. దాని ప్రకారం టీజర్ లో అదిరిపోయే గ్రాండియర్ విజువల్స్, ప్రభాస్ పలికే డైలాగ్, హీరోయిన్ పూజా రొమాంటిక్ సీన్, అదిరిపోయే బాక్ గ్రౌండ్ స్కోర్, ఒక యాక్షన్ సీన్, వెరసి ఈ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు అది మూవీ పై భారీ అంచనాలు క్రియట్ చేయడం ఖాయం అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ అని చెప్పకతప్పదు.....!!