వామ్మో, అదేమి క్రేజ్ రా బాబు ..... మహేష్ బాబు దెబ్బా, మజాకా ......??
ఆపై 1999లో హీరోగా రాజకుమారుడు మూవీ తో ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్, తొలి సినిమా తో సూపర్ డూపర్ హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా తన టాలెంట్ తో అవకాశాలు అందుకుని కొనసాగిన మహేష్, ఆపై కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ చేస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఇక ఆయన సినిమాలు వెండితెర తో పాటు బుల్లి తెర పై కూడా భారీ రేటింగ్స్ ని దక్కించుకుంటూ ఉంటాయి.
ప్రస్తుతం తెరకెక్కుతున్న సర్కారు వారి పాట ఇటీవల తొలి షెడ్యూల్ ని దుబాయ్ లో జరుపుకుంటోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురాం దర్శకుడు. మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలగలిపి పరశురాం తీస్తున్న ఈ మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క శాటిలైట్, మరియు డీజిటల్ రైట్స్ ఇటీవల దాదాపుగా రూ. 55 కోట్లకు అమ్ముడైయ్యాయనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి ఈ విషయమై మూవీ యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఒక ప్రముఖ తెలుగు ఛానల్ ఈ హక్కులను ఇంత భారీ ధరకు కొనుగోలు చేసిందని చెప్తున్నారు. ఒకరకంగా మరే ఇతర టాలీవుడ్ మూవీ కి ఈ రేంజ్ లో శాటిలైట్ బిజినెస్ జరగలేదని అంటున్నారు. ఇది తమ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్, స్టామినా కి నిదర్శనం అని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ మూవీ భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని అంటున్నారు పలువురు మహేష్ ఫ్యాన్స్.......!!