'నాపై వ్యభిచారిణి ముద్ర వేస్తున్నారంటూ' తన ఆవేదన వ్యక్త పరిచిన ప్రముఖ నటి మాధవీలత..!!

Anilkumar
టాలీవుడ్ లో హీరో తనీష్ సరసన నచ్చావులే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మాధవిలత.. ఆ సినిమాలో తన అందం, అమాయకత్వంతో హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది.. సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చాయి.. ఆ తర్వాత నాని సరసన స్నేహితుడా సినిమాతో పాటు పలు మీడియం బడ్జెట్ సినిమాల్లో నటించింది మాధవిలత.. కానీ హీరోయిన్ గా మాత్రం ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది.. ఇక కొన్నాళ్లకు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల బాట పట్టింది.. ప్రస్తుతం బీజేపీ పార్టీలో నాయకురాలిగా కొనసాగుతున్న ఈమె..

 తాజాగా ఓ వ్యక్తి తనపై వ్యభిచార ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ పోలీసు కేసు పెట్టింది.. ఆ వివరాల్లోకి వెళ్తే..  ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో దేవాలయాలపై వరస దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కాగా... ఈ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించినందుకు తనపై వ్యభిచారణిగా ముద్ర వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ నటి, బీజేపీ నేత మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగి.. ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి తెస్తే.. తాను ఎవరినైనా చంపేస్తానంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.సోషల్‌ మీడియాలో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ..

 అశ్లీల పోస్టులు పెట్టి, అసభ్యకర రాతలు రాసి ట్రోల్‌ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని గురువారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ''విజయ్‌ మహరాజ్‌ అనే వ్యక్తి నన్ను టార్గెట్‌ చేసి ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు, మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడు.నన్ను అసభ్యకరంగా చిత్రీకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌ ముందు ధర్నా చేస్తా' అని అన్నారు..ఇక కేసు నమోదు చేసుకున్న పోలిసులు కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాం అని చెప్పినట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: