జాంబి రెడ్డి ఫలితం గురించి ఎదురు చూస్తున్న మెగా ఫ్యామిలీ !

Seetha Sailaja
సంక్రాంతి పండుగ తరువాత విడుదలైన రెండు చిన్న సినిమాలు ఫెయిల్ కావడంతో ప్రేక్షకులు ఇంకా చిన్న సినిమాలను ఆదరించే మూడ్ లో లేరా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ వారం విడుదల కాబోతున్న ‘జాంబి రెడ్డి’ మూవీ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలు చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.


క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న ప్రశాంత్ వర్మ కెరియర్ ఈ మూవీ సక్సస్ పై ఆధారపడి ఉంది. ‘జాంబి రెడ్డి’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రశాంత్ వర్మ భావోద్వేగాన్ని చూసినవారు చాలామంది షాక్ అయ్యారు. రాజశేఖర్ తో తాను తీసిన ‘కల్కి’ మూవీ ఫెయిల్ అవ్వడంతో తాను ఒక సంవత్సరంపాటు డిప్రషన్ లోకి వెళ్ళిపోయాను అంటూ ఓపెన్ గా చెప్పాడు.


అంతేకాదు రాజశేఖర్ తన పై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోవడంతో తాను ఇప్పటికీ బాధపడుతున్నాను అంటూ ఆ షాక్ నుండి తేరుకుని తాను మళ్ళీ ఒక సినిమా తీయడానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది అని అంటున్నాడు. అంతేకాదు తాను వరుణ్ తేజ్ తో ఒక సినిమాను తీయాలనే ప్లాన్ లో ఉన్నానని అదేవిధంగా చిరంజీవికి ఒక కథ చెప్పాలని ప్రయత్నిస్తున్నాని అంటూ ‘జాంబి రెడ్డి’ విడుదల తరువాత ఈ రెండు విషయాలు జరిగే ఆస్కారం ఉంది అంటూ ఆశాభావం వ్యక్త పరిచాడు.


ఒక యంగ్ డైరెక్టర్ కు హిట్ వస్తే చాలు ఆ డైరెక్టర్ మరొక చోటుకు వెళ్ళకుండా బందీ గా మార్చడంలో మెగా కాంపౌండ్ ఎప్పుడు ముందు వరసలో ఉంటుంది. ఇప్పుడు అంచనాల ప్రకారం ‘జాంబి రెడ్డి’ సక్సస్ ను అందుకుంటే ప్రశాంత్ వర్మ మెగా కాంపౌండ్ హీరోలతో ఇక వరసపెట్టి సినిమాలు చేసే ఆస్కారం ఉంది. ఇప్పటివరకు తెలుగు సినిమాలలో ప్రేక్షకులు చూడని ఒక వెరైటీ జోనర్ తో రాబోతున్న ఈ మూవీ ఏమేరకు సగటు ప్రేక్షకుడుకి చేరుకుంటుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: