వామ్మో ... ఆచార్య కు అదే అతి పెద్ద మైనస్ కానుందా ..... ??
ఇప్పటికె చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో దేవాలయాల భూముల కుంభకోణాల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు శివ తీస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని, అలానే ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి ఐ ఫస్ట్ అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో ఎంతో వైరల్ అవుతోంది.
అదేమిటంటే, ఈ మూవీ యొక్క రన్ టైం దాదాపుగా మూడు గంటల వరకు ఉంటుందని అంటున్నారు. ఇటీవల వస్తున్న సినిమాలు చాలావరకు రెండున్నర గంటల లోపే ఉంటున్నాయని, ఇటువంటి సమయంలో ఆచార్య మూవీ రన్ టైం మూడు గంటలు ఉండడం ఒకరకంగా ఆ మూవీ కి కొంత మైనస్ గా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈ వార్త పై అధికారికంగా ఇంకా న్యూస్ బయటకు రాలేదని, ఈ విషయాన్ని యూనిట్ దృవీకరించేవరకు దీనిని విశ్వసించలేమని అంటున్నారు పలువురు విశ్లేషకులు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే......!!