అక్కినేని మనం రిపీట్ వార్తలతో వేడెక్కిన టాలీవుడ్ !
ఆ అభిమానంతోనే లేటెస్ట్ గా నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ మూవీని చేస్తున్నాడు. ఈమూవీ నిర్మాణ పనులు చూస్తూనే విక్రమ్ కుమార్ ఆలోచనల నుండి వచ్చిన ‘మనం 2’ ప్రాజెక్ట్ కు నాగార్జున ఓకె చెప్పాడు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ ‘మనం 2’ లో నాగార్జున నాగచైతన్య అఖిల్ తో పాటు నాగార్జున మెనల్లుళ్ళు సుమంత్ లతో పాటు నాగార్జున భార్య అమల నాగచైతన్య భార్య సమంత కూడ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈమూవీలో నాగార్జున 60 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడని టాక్. ఈమూవీ కథ కూడ చాల డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఉంటుందని సమాచారం. ఈమూవీ కథ నాగ్ కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ను తన అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నిర్మించడానికి ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ‘మనం 2’ వార్తలు వస్తున్నాయి.
అయితే కథ విషయంలో నాగార్జున ఇప్పటివరకు విక్రమ్ కుమార్ చెప్పిన కథలకు ఓకె చెప్పక పోవడంతో ఆలస్యం జరిగింది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు లేటెస్ట్ గా చెప్పిన స్టోరీ లైన్ నాగ్ కు బాగా నచ్చడంతో ఈమూవీ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది అంటున్నారు. వాస్తవానికి అక్కినేని నందమూరి మెగా కుటుంబాలలో అనేకమంది హీరోలు ఉన్నారు. అయితే అక్కినేని కుటుంబం కలిసి నటిస్తున్న విధంగా నందమూరి మెగా కుటుంబాలలో హీరోలు కలిసి సినిమాలలో నటించలేక పోతున్నారు. ఇప్పుడు ‘మనం 2’ కూడ వచ్చేస్తోంది కాబట్టి నందమూరి మెగా కుటుంబ హీరోల ఆలోచనలలో మార్పులు వచ్చే ఆస్కారం ఉంది..