షాకింగ్ వసూళ్లు సాధించిన ప్రదీప్ సినిమా....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. యాంకర్ ప్రదీప్ చాలా కాలం పాటు యాంకర్ గా అలరిస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు. అపారమైన ప్రేక్షకాభిమానాన్ని సాధించాడు. ఇక యాంకర్ గా ముద్ర వేసుకున్న ప్రదీప్ ఇప్పుడు హీరోగా మారి మన ముందుకు వచ్చాడు.యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా "30రోజుల్లో ప్రేమించడం ఎలా?" మొత్తానికి శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రల్లో యాంకర్ గా ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న ప్రదీప్ ఫస్ట్ సినిమా కావడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారిగానే ఉన్నాయి. ఇక సినిమా విడుదల తరువాత బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు లాభాలు అందుకుంటుంది అనేది హాట్ టాపిక్ మారింది.ఈ సినిమా ఎంత వసూలు చేసింది ప్రదీప్ కెరీర్ కి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని అనుమానాలు చాలా మందిలో వున్నాయి.

ఇక ప్రదీప్ కి వున్న సూపర్  క్రేజ్ తో పాటు సినిమాకు నీలీ నీలి ఆకాశం పాటతో వచ్చిన క్రేజ్ కూడా బాగానే ఉపయోగపడింది. మొత్తానికి ఓపెనింగ్స్ తో అదరగొట్టేసాడు ఈ యాంకర్ హీరో. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ధర 4కోట్లకు పైగానే పలికినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30రోజుల్లో ప్రేమించడం ఎలా? మొదటి రోజు 2.73కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందించింది.ఇక ఏరియాల వారిగా వచ్చిన మొత్తం షేర్స్ ఈ విధంగా ఉన్నాయి.నైజాం లో 60 లక్షలు, సీడెడ్ లో 24 లక్షలు,ఉత్తరాంధ్రలో 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో 12.5 లక్షలు,కృష్ణ జిల్లాలో 10 లక్షలు,గుంటూరు జిల్లాలో 19.1 లక్షల వసూళ్ళని ఈ సినిమా రాబట్టింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా కలిపి మొత్తంగా 1 కోటి 69 లక్షల షేర్ వసూళ్ళని ఈ సినిమా సాధించింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: