స్టార్ తనయుడు మరో క్రేజీ కాంబో ఫిక్స్..!

shami
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రం తనయుడు ధృవ్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ గా ఆదిత్య వర్మ సినిమాతో అలరించిన ధృవ్ తన నెస్క్స్ట్ సినిమా తండ్రి విక్రం తో చేస్తున్నాడు. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో విక్రం, ధృవ్ కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రం డాన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో తనకన్నా తనయుడికి ఎక్కువ స్కోప్ ఉండేలా చూస్తున్నాడట విక్రం.

ఇక ఈ సినిమా తర్వాత పా రంజిత్ తో ధృవ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినితో కబాలి, కాలా సినిమాలు చేసిన రంజిత్ తను సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ లో రంజిత్ నిర్మాతగా ధృవ్ హీరోగా సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను మారు సెల్వారాజ్ డైర్కెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా కంటెంట్ మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.

ధృవ్ కెరియర్ ను నిలబెట్టాలని విక్రం చాలా కష్టపడుతున్నాడు. మొదటి సినిమా వర్మ, ఆదిత్య వర్మగా మారి అలరించినా ధృవ్ ఇంకా డెవలప్ అవ్వాలని అంటున్నారు. మొత్తానికి ధృవ్ కెరియర్ మీద విక్రం ప్లాన్ అదిరిందని చెప్పొచ్చు. స్టార్ తనయుడిగా మొదటి రెండు అవకాశాలు వచ్చినా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని ధృవ్ స్టార్ గా ఎదగాలని చియాన్ అభిమానులు కోరుతున్నారు. విక్రం తో మల్టీస్టారర్ సినిమా పక్కా హిట్ అనేలా కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. సెల్వరాజ్ సినిమా కూడా క్రేజీగా ఉండబోతుందని అంటున్నారు.                                                      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: