సమ్మర్ త్వరగా రావాలని కోరుకుంటున్న నిహారిక.. ఎందుకంటే..!?

N.ANJI
బుల్లితెర నవ్వుల రారాజు నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నిహారిక చైతన్యని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అమ్మాయిల్లో తేడా వస్తుందంటారు. కానీ నిహారికలో మాత్రం అలాంటివేం కనిపించడం లేదు. అయితే చాల మంది సమ్మర్ ని ఇష్టపడుతారు. మరోవైపు సినిమా వాళ్లకు కూడా సమ్మర్ అంటే చాలా యిష్టం. ఎందుకంటే అప్పుడు విడుదలైన సినిమాలకు తేడాగా టాక్ వచ్చినా కూడా హాలీడేస్ కాబట్టి ఆడేస్తుంటాయి. ఇప్పుడు నిహారిక కూడా సమ్మర్ కోసం ఆశగా చూస్తుంది.

ఇక సమ్మర్ కోసం ఇప్పట్నుంచే చూస్తుంది ఈ భామ. అయితే నిహారిక సమ్మర్ కోసం అంతలా ఎదురుచూడానికి కారణం ఏమిటంటే.. ఆమె పెదనాన్న చిరంజీవి. అవును..ఈయన నటిస్తున్న ఆచార్య టీజర్ విడుదలైంది. యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో మెగాస్టార్ రచ్చ చేసాడు. 65 ఏళ్ల వయసులో అన్నయ్య ఎనర్జీ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. వామ్మో చిరు ఏంటి ఇంత యంగ్ గా ఉన్నాడంటూ నోరెళ్లబెడుతున్నారు. టీజర్ కూడా విడుదలైన క్షణం నుంచి వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. టీజర్ చూసి అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమా మే 13న విడుదల కానుందంటూ ప్రకటించారు కూడా. ఇదిలా ఉంటే ఈ టీజర్ చూసి నిహారిక సోషల మీడియా వేదికగా ఆమె అభిప్రాయాన్ని తెలియజేసింది.

ఇక ఆమె ఈవిధంగా పోస్టు చేశారు. డాడీ.. నిన్నిలా చూస్తుంటే వామ్మో అదిరిపోతుంది.. మీ యాక్షన్ సూపర్.. సమ్మర్ వరకు ఆగాలా.. అంతవరకు వెయిట్ చేయడం వల్ల కాదు.. ఈ సమ్మర్ ఏదో త్వరగా వచ్చుంటే బాగున్ను అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో చిరు ఆచార్య టీజర్ ను జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: