ఉప్పెన బ్యూటీ లేటెస్ట్ స్టిల్స్.. అమ్మడు అలా చూస్తే ఇలా పడిపోవాల్సిందే..!
ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్న కృతి శెట్టి హాఫ్ శారీలో దిగిన పిక్స్ ను ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది. బ్లూ క్లర్ హాఫ్ శారీలో అమ్మడు సింపుల్ గా సూపర్ అనిపించేలా ఉంది. ఆ సొట్ట బుగ్గ అమ్మడిని స్పెషల్ గా కనిపించేలా చేస్తుంది. కచ్చితంగా తెలుగులో అమ్మడి పేరు కొన్నాళ్లు మారుమోగుతుందని చెప్పొచ్చు. కృతి షేర్ చేసిన ఫోటోలను అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. ఉప్పెనలో లుక్స్ పరంగానే కాదు అభినయం పరంగా కూడా అమ్మడు అలరిస్తుందని అంటున్నారు.
ఇక నాని శ్యాం సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవికి పోటీగా నటిస్తున్న కృతి శెట్టి ఆ తర్వాత సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది. మొత్తానికి కృతి తెలుగులో కనీసం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఉప్పెనకు సెలెక్ట్ అయ్యి నటిస్తూ ప్రచార చిత్రాలు రిలీజ్ అయ్యాకనే ఆమె సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ పెరిగినట్టు తెలుస్తుంది. ఇక ఆశించిన స్థాయిలోనే ఉప్పెన హిట్ అయితే మాత్రం కృతి శెట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉంటుందని చెప్పొచ్చు.