సీటిమార్ మార్ సినిమాపై కొండంత ఆశలు పెట్టుకున్న గోపి చంద్...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్  యాక్షన్ హీరో గోపీచంద్ మంచి  మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు గోపి చంద్. యాక్షన్ హీరోగా అలరించిన గోపి చంద్  ఇప్పుడు కామెడీ హీరోగా మారాడా అంటే నిజమే అంటున్నాయి  ఫిలిం నగర్ వర్గాలు. సీటీమార్ అంటూ  కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ చేస్తున్న సినిమా నుంచి ఇప్పుడు ఆసక్తికరమైన ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని సంపత్ నంది తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నాడట. తెలంగాణా – ఆంధ్రా జట్ల మధ్య జరిగే ఈ కబడ్డీ పోటీలు చాలా ఆసక్తికరంగా వుంటాయని చిత్రబృందం వారు  చెప్తున్నారు. తెలంగాణా జట్టు కోచ్ గా తమన్నా, ఆంధ్రా జట్టు కోచ్ గా గోపీచంద్ ల నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఈ సినిమాకి  హైలెట్  అవుతుంది అని అంటోంది మూవీ టీమ్.అయితే, ఈ సినిమా అంతా కామెడీ నేపథ్యంలో సాగుతుంట.

ముఖ్యంగా తమన్నా, గోపీచంద్ ల మద్య వచ్చేసీన్స్, అలాగే వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదుర్స్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ – వెన్నెల కిషోర్ కి మధ్య నడిచే కామెడీ ట్రాక్ సినిమాకు హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. సెకండ్ ఆఫ్ లో కూడా కావాల్సినంత కామెడీ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా మీదే మన యాక్షన్ హీరో గోపి చంద్ కొండంత ఆశలు పెట్టుకున్నాడట. ఎప్పట్నుంచో  సరైన హిట్  కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్  ఈ సినిమా తో బంపర్ హిట్ కొట్టేస్తాడట.ఎందుకంటే యాక్షన్ మూవీస్ లో కంటే కూడా గోపీచంద్ సరదాగా ఉండే సినిమాలే సూపర్ సక్సెస్ లు అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ గోపీచంద్ కి వర్కౌట్ అవుతుందనే అంటున్నారు. ఇప్పటికే సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదిన విడుదలకు సిద్ధమవుతుందట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: