ఈసారి బరిలో పైచేయి ఎవరిది..?
రంగస్థలం సినిమాతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న సుకుమార్ ఈ మూవీ ని డైరెక్ట్ చేయడం..వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండడం..హ్యాట్రిక్ కాంబో మ్యూజిక్ డైరెక్టర్ దేవి మ్యూజిక్ చేస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మధ్యనే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నా ఈ మూవీ తాలూకా రిలీజ్ డేట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. ఎప్పుడు షూటింగ్ పూర్తి అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అంత మాట్లాడుకుంటున్న వేళా.. ఒకేసారి ఆగస్టు 13 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపి చిత్రసీమ లో అలజడి సృష్టించారు. ముఖ్యంగా ఈ రిలీజ్ డేట్ ప్రకటన రాగానే సర్కారు వారు పాట మూవీ మేకర్స్ మరింత షాక్ కు గురయ్యారని అంటున్నారు.
పరుశురాం, మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న సర్కారు వారు పాట షూటింగ్ ఎట్టకేలకు దుబాయ్ లో మొదలుపెట్టుకుంది. ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్టు మొదటి , రెండో వారంలో రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు పుష్ప టీం మూవీ ప్రకటన చూసి కాస్త ఆలోచనలో పడ్డారట. గత ఏడాది సంక్రాంతి బరిలో ఒకేసారి అల్లు అర్జున్, మహేష్ బరిలోకి దిగగా.. బన్నీ ఫై చేయి సాధించాడు. మరి ఇప్పుడు మరోసారి బరిలోకి దిగితే ఎవరు ఫైచేయి సాదిస్తారనేది ఇరు అభిమానులు , సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారట. మరి మహేష్ మూవీ యూనిట్ రిలీజ్ డేట్ విషయంలో మరోసారి ఆలోచిస్తారా.. లేక బరిలోకి దిగుతారా అనేది చూడాలి.