"నా లైఫ్ లో చేసిన పెద్ద రిస్క్ అదే.. ఆ విషయం నా భార్యకు కూడా తెలీదు" : విజయ్ సేతుపతి..!!
ఇక ఇటీవల విడుదలైన మాస్టర్ సినిమాలో విజయ్ సేతపతి నటనకు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. హీరో విజయ్ కంటే విలన్గా విజయ్ సేతుపతికే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పాలి..సినిమాలో 'భవాని' అనే విలన్ పాత్రలో సేతుపతి పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్ లో ఉండటంతో..ఈ హీరోకి ఇప్పుడు అన్ని ఇండ్రస్టీల్లో నెగెటివ్ రోల్స్ చేయడానికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. విజయ్ సేతుపతి తన జీవితంలో చేసిన అతిపెద్ద రిస్క్ గురించి తాజాగా చెప్పుకొచ్చాడు. తాను పెళ్లి చేసుకున్న తరువాత సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టానని..
ఆ సమయంలో ఈ విషయం తన భార్యకు కూడా తెలియదని తెలిపాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరేళ్ల తరువాత తాను హీరో అయ్యానని, అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలే చేసుకుంటూ వచ్చానని అన్నాడు. తాను సినిమాల్లో తిరుగుతున్నానన్న విషయం తెలుసుకుని తన భార్య ఎంతో బాధపడినట్టు చెప్పాడు. సినిమాల్లో డబ్బులు పెద్దగా రాకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని తన భార్య చాలా బాధపడేదని, తన జీవితంలో చేసిన పెద్ద రిస్క్ ఇదేనంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టాడు విజయ్ సేతుపతి...!!