నటసింహం
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం
మాస్ సినిమాల దర్శకుడు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న
సినిమా షూటింగ్
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా
బాలయ్య కు జోడీగా ప్రగ్య
జైస్వాల్ నటిస్తుండగా
యువ నిర్మాత మిర్యాల
రవీందర్ రెడ్డి ఈ
మూవీ ని ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ
సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో
బాలయ్య అఘోరాగా, అలానే ఒక మధ్యతరగతి రైతుగా రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.
ఓవైపు
బాలయ్య, మరోవైపు
బోయపాటి కెరీర్ పరంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తుండడంతో ఈ
మూవీ తప్పకుండా భారీ
సక్సెస్ కొట్టి వారిద్దరికీ సూపర్ బ్రేక్ అందించడం ఖాయం అని పలువురు
నందమూరి ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని తరువాత బి. గోపాల్, గోపీచంద్ మలినేని,
సంతోష్ శ్రీనివాస్ లతో
బాలయ్య తన తదుపరి సినిమాలు చేయనున్నారు అనే వార్తలు కొద్దిరోజులుగా పలు
మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.
మరోవైపు
బాలయ్య తో
బి గోపాల్ తీయబోయే సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిందని,
టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ మూవీని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించానుందని అంటున్నారు. మంచి యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో వరుస విజయాల
భామ పూజా హెగ్డే బాలయ్య సరసన
హీరోయిన్ గా ఎంపికయింది అనేది లేటెస్ట్
టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల ఆమెను కలిసిన దర్శకుడు గోపాల్, కథ కథనాలు వినిపించడం, అవి ఆమెకు ఎంతో నచ్చడంతో
పూజా కూడా ఈ మూవీకి డేట్స్ కూడా కేటాయించినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే తొలిసారిగా
బాలయ్య సరసన
హీరోయిన్ గా మేడం మంచి ఛాన్స్ పట్టేసినట్లే .....!!