హాట్ టాపిక్ అయిన అనుష్క శర్మ 2 కోట్లు !

Seetha Sailaja
'పికె’ సినిమా అద్భుత విజయం సాధించడంతో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు సంబంధించిన ఏ వార్తలు వచ్చినా అవి ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఒక ప్రముఖ ఫ్యాషన్ మేగజైన్ కు ఒక హాట్ ఫోటో షూట్ ఇవ్వడానికి ఎగ్రిమెంట్ చేసుకుందని ఆ ఎగ్రిమెంట్ ప్రకారం ఆమెకు ఆ ఫ్యాషన్ మేగజైన్ అధినేతలు 2 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారని టాక్.  అంతేకాదు ఈ ఫోటో షూట్ లో అనుష్క ఆ మేగజైన్ కోసం న్యూడ్ గా ఫోజులు ఇవ్వడానికి రెడీ అయింది అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. త్వరలో ఈ హాట్ ఫోటో షూట్ తో ఈ మేగజైన్ కొన్ని లక్షల కాపీలను మార్కెట్ లోకి వదల బోతోంది అని బాలీవుడ్ మీడియా వార్తల హడావిడి చేస్తోంది.  ఇండియాలో ప్రముఖ మేగజైన్ గా పేరొందిన ఈ మేగజైన్ ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, హాట్ మోడల్స్ ఫోటోలను తమ మేగజైన్ పై నగ్నంగా ప్రచురించి సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ వార్తలు బయటకు రావడంతో చాలామంది అనుష్క శర్మ అభిమానులు ఈ మేగజైన్ లేటెస్ట్ ఇష్యూ ఎప్పుడు విడుదల అవుతుంది అని అప్పుడే ఎంక్వయిరీలు మొదలు పెట్టినట్లు టాక్.  అయితే ఇప్పటికే అనుష్క శర్మ స్పీడ్ కు బ్రేక్ లు వేస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లి లేటెస్ట్ గా వస్తున్న ఈ బాలీవుడ్ గాసిప్పుల పై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ సంగతి పక్కన పెడితే ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియాలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న అనుష్క ఇంకా అక్కడే సందడి చేస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: