పవన్ కు ఎదురు వస్తున్న శర్వానంద్ !

Seetha Sailaja
యంగ్ హీరో శర్వానంద్ కు మంచి నటుడిగా పేరు వచ్చినా అదృష్టం అంతగా కలిసి రావడంలేదు. ఈమధ్యనే ‘రన్ రాజా రన్’ తో ఒక మోస్తరు హిట్ కొట్టడంతో శర్వాకు ఆత్మ స్థైర్యం బాగా పెరిగి పోయి, ఈ సారి ఏకంగా పవన్ కళ్యాణ్ కు ఎదురు వెళుతూ ఒక పెద్ద సాహసం చేయబోతున్నాడు.  శర్వానంద్, నిత్యామీనన్ తో కలిసి నటించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ సినిమాను సంక్రాంతి రేసులో పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ తో పోటీగా విడుదల చేయడం ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యకరమైన వార్తగా మారింది. చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన కెఎస్ రామారావు నిర్మిస్తున ఈ సినిమాను సంక్రాంతి రేసులో నిలిపుతున్నట్లు స్వయంగా నిర్మాత రామారావు ప్రకటించడంతో ఈ సినిమాలో పవన్ సినిమాతో పోటీ పడేంత దమ్ము ఉందా? అంటూ కొదరు అప్పుడే సెటైర్లు మొదలు పెట్టారు.  క్రియేటివ్ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కథ ఒక వెరైటీ లవ్ స్టొరీ అని నిర్మాత చెపుతున్నా సంక్రాంతి హోరులో పవన్ గోపాలుడి ఎదుట ఈ సినిమా ఎంత వరకు నిలదొక్కుకుంటుంది అనేది ఎవరికీ అర్ధంగాని ప్రశ్న. గతంలో చిరంజీవి నటించిన ఒక సూపర్ హిట్ సినిమాలోని పాటను ఈ సినిమాకు టైటిల్ గా మార్చి అదే కుటుంబానికి చెందిన పవర్ స్టార్ పవన్ సినిమాతో పోటీగా వస్తున్న నేపధ్యంలో ఈ సినిమాకు కనీసం పాస్ మార్కులు పడినా అది శర్వానంద్ కు బంపర్ హిట్ కొట్టిన ఆనందాన్ని ఇస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: