ఐటమ్ సాంగ్స్ లేకుండా నేటి టాప్ హీరోలు తమ సినిమాలలో నటించే సాహసం చేయలేకపోతున్నారు. ప్రేక్షకులు కూడ మంచి ఊపు ఉండే ఐటెమ్ సాంగ్స్ కోసం విపరీతంగా ఇష్టపడుతున్నారు. దీనితో టాప్ దర్శకులు అంతా తాము దర్శకత్వం వహిస్తున్న సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ఐటెమ్ సాంగ్స్ ను భారీసెట్స్ వేసి తీస్తూ ప్రేక్షకులని మెప్పించడానికి ప్రయత్నిమ్స్తున్నారు.
పూరీ జగన్నాథ్ సినిమాలలో ఐటెమ్ సాంగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. 'పోకిరి' లో ‘ఇప్పటికింక’ సాంగ్ ఆ సినిమా విజయానికి ఎంత దోహద పడిందో అందరికీ తెలిసిన విషయమే. ‘పోకిరి’ తరువాత అటువంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోలేక పోయిన పూరి ప్రస్తుతం తాను జూనియర్ తో తీస్తున్న ‘టెంపర్’ ను ఆ సినిమా రేంజ్ లో సూపర్ హిట్ చేయడానికి ఒక భారీ మసాల యిటమ్ సాంగ్ ను డిజైన్ చేసి మొరాకో మోడల్ కమ్ బెల్లీ డ్యాన్సర్‌ను రంగంలోకి దింపాడని టాక్.
బాలీవుడ్‌లో రోర్ టైగర్స్ ఆఫ్ సుందర్బన్‌తో ఎంట్రీ ఇచ్చిన నోరా ఫతేహికి, సన్నీ లియోన్ తర్వాత అంత క్రేజ్ ఉంది. సాధారణంగా నైట్ పార్టీల సంస్కృతికి చిరునామాగా ఉండే బాలీవుడ్ లో జరిగే నైట్ పార్టీలకు తరుచూ వస్తూ ఉండే నోరా ఆ పార్టీలకు రాగానే ‘సెక్స్ ఆన్ బీచ్’ కావాలని అడుగుతుందట. వినడానికి హాట్‌గా, షాకింగ్‌గా ఉన్న ఇదోరకం కాక్ టైల్ వోడ్కా అనే విషయం చాలామందికి తెలీదు. ఎక్కువగా ఫారిన్ మోడల్స్ ఇష్టపడే హాట్ డ్రింక్ ఇది.
మరి ఇటువంటి హాట్ డ్రింక్ లను ఇష్టపడి తాగే ఈ హాట్ బ్యూటీ ‘టెంపర్’ లో ఎటువంటి ఐటమ్ సాంగ్ చేసి ఆదరగోడుతుందో అనే వార్తలు ఇప్పటి నుంచే మొదలు అయిపోయాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: