తెగించి కొడితే...

పవర్ ఫుల్ డైలాగులు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. ఈ డైలాగులే హీరోలను ఆకాశానికెత్తేస్తున్నాయి. ‘కత్తులతో కాదు కంటి చూపుతోనే చంపేస్తా’, ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి...’ ‘నాకు కొంచెం తిక్క... దానికో లెక్క...’ వంటి డైలాగులు మనకు కొత్తేం కాదు. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమాలో కూడా ఇలాంటి డైలాగ్ ఒకటి ఉందట. యంగ్ రెబల్ స్టార్ కొత్త సినిమా ‘మిర్చి’. ఈ ఘాటుకు తగ్గట్టే ఇందులో ఓ డైలాగ్ ఉంది. ‘నేను తెగించి కొడిత తల తెగడానికి తల్వార్ కూడా అవసరం లేదు’... ఇదీ ఆ డైలాగ్. ఇలాంటివి ఈ సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో. ఇవి థియేటర్లో ఎంత వరకూ పేలతాయో? ఇలా ఏదైనా ఒక పంచ్ డైలాగ్ కొడితే సినిమా హిట్ కావొచ్చన్నది ఓ సెంటిమెంటులా ఉంది. మొన్న రెబల్ దెబ్బకి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది కదా. ఈసారైనా నలుగురు హీరోలూ నడిచే దారిలో... నలుగురూ ఫ్లోలో డైలాగులు చెబితే... అదే వరుసలో హిట్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నట్టున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఎలాగైతేనేం... ఓ హిట్టుకొట్టు బాబూ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: