'రాంబాబు' రచ్చకు అసలు కారణం..?

ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేస్తున్న రచ్చ చూస్తుంటే.. విడుదలకు ముందు నుంచి ఉన్న గొడవలకీ ఇప్పటి రచ్చకీ సంబంధం ఉందనిపిస్తోంది. రిలీజ్ కు ముందే నిర్మాత దానయ్యకూ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు మధ్య గొడవైంది. పూరీకివ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వనంటూ అప్పట్లో దానయ్య అడ్డం తిరిగాడు. దీంతో పూరీ ఫిలించాంబర్ లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో హీరో పవన్ కళ్యాణ్ కూడా ప్రొడ్యూసర్ నే సపోర్ట్ చేశాడు. అయితే చివరికి ఎలాగోలా సెటిల్ చేసి సినిమా రిలీజ్ చేశారు. అయితే అప్పటి గొడవకు కూడా సినిమా అవుట్ పుట్, పొలిటికల్ ఇష్యూలే కారణమేమో అన్న డౌట్లు మొదలయ్యాయి. రాంబాబు సినిమా విషయానికొస్తే... పూర్తిగా పొలిటికల్ స్పూఫ్ లా కనిపిస్తుంది. పూరీ జగన్నాథ్ తన భావజాలాన్ని స్క్రీన్ పై అడ్డంగా రుద్దేసినట్టు అనిపిస్తుంది. అసలిలాంటి స్టోరీని పవర్ స్టార్ ఎలా ఒప్పుకున్నాడన్నది అర్ధం కాని అంశం. గబ్బర్ సింగ్ లాంటి బంపర్ హిట్ తర్వాత పవన్ నించి ఇలాంటి సినిమాని ఊహించలేం కూడా. అసలు స్టోరీ చూడకుండానే ప్రొడ్యూసర్ దానయ్య, పవన్ కళ్యాణ్... పూరీకి జెండా ఊపేశారేమో అన్న డౌట్లు వస్తున్నాయి. పొలిటికల్ గా అయిన రగడ తప్ప రాంబాబు సినిమాకొచ్చిన రెస్పాన్స్ అంతంతమాత్రమే. తన భావజాలాన్ని తెరపై జొప్పించి అటు ప్రొడ్యూసర్ నీ, ఇటు హీరోనీ నొప్పించాడు పూరీ జగన్నాథ్. మొత్తానికి రాంబాబు సినిమాతో పూరీ లో ఓ కొత్త కోణం బైటపడింది. తను అందరూ అనుకునేటంత జోవియల్ టైప్ కాదని తేలిపోయిందంటున్నారంతా. ప్రొడ్యూసర్ డబ్బుల్నీ, పవన్ ఇమేజ్ ని పణంగా ఇలాంటి సినిమా తీయడంపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. తన సోది చెప్పడానికి ఇద్దర్నీ, డైరెక్టర్ అడ్డంగా వాడేసుకున్నాడంటున్నారంతా.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: