మహేష్ నష్టాలకు పూచీ పడుతున్న నాని !

Seetha Sailaja
మహేష్ తో ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ లాంటి భారీ సినిమాలను తీసిన 14 రీల్స్ నిర్మాణ సంస్థకు మహేష్ సినిమాలు వరస పెట్టి పరాజయం చెందడంతో ఈ నిర్మాణ సంస్థ పై అదేవిధంగా ఈ సంస్థ నిర్మాతల పై రకరకాల రూమర్స్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. మహేష్ సినిమాలను అతడి క్రేజ్ ను అడ్డం పెట్టుకుని భారీ మొత్తాలకు విడుదలకు ముందే బయ్యర్లకు అమ్మేసి ఈ నిర్మాణ సంస్థ తెలివిగా వ్యవహరించినా భయంకరమైన ఫ్లాప్ టాక్ తో పెట్టిన పెట్టుబడిలో సగభాగం కూడా రాకపోవడంతో ఈ సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు తమ నష్టాలను పుడ్చామని 14 రీల్స్ నిర్మాణ సంస్థ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఒత్తిడితో ఈ నిర్మాణ సంస్థ నిర్మాతలు క్రేజ్ ఉన్న ఇద్దరు చిన్న హీరోలతో సినిమాలనుతీసి ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి మాస్టర్ ప్లాన్ రచించినట్లుగా వార్తలు వస్తునాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నిర్మాణ సంస్థ ‘ఈగ’ హీరో నానీతో ఒక సినిమా సునీల్ తో మరో సినిమాను త్వరలో ప్రారంభించి ఈ కష్టాల నుండి బయట పడటానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్.  అయితే ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థలు తీస్తున్న సినిమాలలో అవకాశాలు లేక బాధపడుతున్న నానీ, సునీల్ లకు ఈ ఆఫర్ బంపర్ ఆఫర్ గా మారుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. సినిమాల విజయ అవకాశాలు ఎలా ఉన్నా సినిమాలకు భారీ పబ్లిసిటీ ఇచ్చే విషయంలో ప్రస్తుతం 14 రీల్స్ నిర్మాణ సంస్థ నెంబర్ వన్. ఏమైనా మహేష్ నష్టాలను నానీ పూడ్చగలిగితే అది టాలీవుడ్ రికార్డే...   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: