వివాదంలో అల్లరి నరేష్ సినిమా.. విడుదల ఆగిపోయినట్లేనా ?

Satvika
ఈ మధ్య కరోనా కారణంగా సినిమాలు విడుదల కాలేదు. ఇటీవల థియేటర్లు తెరుచుకోవడం తో సినిమాల సందడి మొదలైంది. ఒక్కో సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకటి అల్లరి నరేష్ నటిస్తున్న  బంగారు బుల్లోడు..ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లోని కొన్ని సన్ని వేశాల పై స్వర్ణ కార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వృత్తిని కించపరిచేలా చూపించిన కొన్ని సీన్లను సినిమా లోంచి తొలగించాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘాలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేశాయి.

ఈ మేరకు గురువారం స్వర్ణ కార సంఘాలు వినతి పత్రాలు అందజేశాయి. ఒకరి బంగారు ఆభరణాలను వేరొకరి వేడుకలకి స్వర్ణకారులు ఇవ్వరని.. అలా ఇస్తున్నట్టు ట్రైలర్ ‌లో చూపించి స్వర్ణ కారులను కించపరిచారని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణు మాధవ్ పేర్కొన్నారు. స్వర్ణ కారుల పై ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నా వెంటనే వాటిని తొలగించాలని తెలిపారు. అంతేకాకుండా రిలీజ్‌కు ముందు ప్రివ్యూ వేయాలని, లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని అడ్డుకుంటామని హెచ్చరించారు.

సినిమాలను తీసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి తీస్తే ఇలాంటి పరిస్థితి రాదని ఆయన అన్నారు. సినిమా అనేది వినోదాన్ని పంచేదిగా ఉండాలి కానీ, వివాదాన్ని తెచ్చేదిగా ఉండకూడదు. ఈ సినిమాలో అలాంటి సన్ని వేశాలు వెంటనే తొలగించి సినిమాను విడుదల చేసుకోవచ్చునని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ ‌పై తెరకెక్కిన ఈ సినిమాకు గిరి పి దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్‌ జోడీ గా హీరోయిన్‌ పూజా జవేరీ నటించింది. ఈనెల 23న ఈ చిత్రం థియేటర్ల లో విడుదల కానుంది. మరి ఇప్పుడు సినిమా విడుదల పై క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: